జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్ద.. కార్పొరేట‌ర్ల‌తో క‌లిసి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధ‌ర్నా.. ఉద్రిక్త‌త‌

18-06-2021 Fri 12:38
  • నాలాలలో పూడిక‌తీత ప‌నులు చేప‌ట్టాల‌ని బీజేపీ డిమాండ్
  • జీహెచ్ఎంసీ కార్యాల‌యం గేటు వ‌ద్ద బైఠాయించిన బీజేపీ నేత‌లు
  • గేటు ఎక్కేందుకు బీజేపీ శ్రేణుల య‌త్నం
  • భారీగా మోహరించిన పోలీసులు 
raja singh agitation at ghmc office

హైద‌రాబాద్‌లోని జీహెచ్ఎంసీ కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. బీజేపీ కార్పొరేట‌ర్లు, చింత‌ల రామ‌చంద్రారెడ్డితో క‌లిసి ఎమ్మెల్యే రాజాసింగ్ జీహెచ్ఎంసీ ప్ర‌ధాన‌ కార్యాల‌యం ఎదుట‌ ధ‌ర్నాకు దిగారు. నాలాల్లో పూడిక‌తీత ప‌నులు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.

ఈ స‌మ‌యంలో జీహెచ్ఎంసీ కార్యాల‌యం గేటు వ‌ద్ద బైఠాయించిన బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు గేటు ఎక్కేందుకు ప్ర‌య‌త్నించారు. వారిని పోలీసులు అదుపు చేశారు. దీంతో బీజేపీ కార్పొరేట‌ర్లు, కార్య‌కర్తలు అక్కడ నినాదాలు చేస్తున్నారు. అభివృద్ధి ప‌నులకు ఆటంకాలు ఎదురుకాకూడ‌ద‌ని, సత్వ‌ర‌మే నాలాల్లో పూడిక‌తీత‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు.