వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ గా మరోసారి కూడా అవకాశం?

18-06-2021 Fri 11:30
  • 21వ తేదీతో ముగుస్తున్న పాలకమండలి గడువు
  • రేపు భేటీ కానున్న పాలకమండలి
  • 22 నుంచి శ్రీవారికి జేష్ఠాభిషేకం ఉత్సవాలు
YV Subbareddy may get opportunity to be TTD charman for second time

టీటీడీ పాలకమండలి గడువు ఈ నెల 21తో ముగుస్తోంది. దీంతో కొత్త పాలకమండలి ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికే మరోసారి ఆవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రేపు టీటీడీ పాలకమండలి సమావేశం కాబోతోంది. ఎల్లుండి స్వామివారి ఆలయంలో భోగశ్రీనివాసమూర్తికి ఏకాంతంగా సహస్రకలశాభిషేకాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. 22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. 24వ తేదీన వర్చువల్ ఆర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. రేపు జరగనున్న చివరి పాలకమండలి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో వేచి చూడాలి.