ఆసక్తిని రేకెత్తిస్తున్న 'రాజ రాజ చోర' టీజర్

18-06-2021 Fri 11:28
  • శ్రీవిష్ణు నుంచి మరో మూవీ
  • కథానాయికగా మేఘ ఆకాశ్
  • కీలకమైన పాత్రలో రవిబాబు
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు    
Raja Raja Chora teaser is intresting

శ్రీవిష్ణు కథానాయకుడిగా హసిత్ గోలి దర్శకత్వంలో 'రాజ రాజ చోర' సినిమా రూపొందింది. ఈ సినిమాలో మేఘ ఆకాశ్ కథానాయికగా నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. హీరో ఓ మురికివాడలో నివాసం ఉంటూ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. చాలా స్టైల్ గా తయారైపోయి, తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను అని చెప్పుకుంటూ ఉంటాడు. ఆ అబద్ధం చెప్పే కథానాయికకు దగ్గరవుతాడు అనే విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది.

ఇక ఈ సినిమాలో రవిబాబు .. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఒక కేస్ క్లోజ్ చేయడానికిగాను ఒక అమాయకుడైన యువకుడి కోసం వెదుకుతున్న ఆయనకి హీరో తారసపడతాడు. ఆ తరువాత ఏం జరుగుతుందనే ఆసక్తికరమైన సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వినోదభరితమైన ఈ సినిమా, మేఘ ఆకాశ్ కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.