హైద‌రాబాద్‌లో వజ్రాల వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

18-06-2021 Fri 11:16
  • హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘ‌ట‌న‌
  • నాగోల్ లోని మధురానగర్లో అద్దెకు ఉంటోన్న వ్యాపారి
  • ఇంట్లో దాదాపు రూ.40 లక్షలు విలువ చేసే వజ్రాలు, రత్నాలు చోరీ
robbery in hyderabad

హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జ‌రిగింది. నాగోల్ లోని మధురానగర్లో ఉండే మురళీకృష్ణ ఇంట్లో దాదాపు రూ.40 లక్షలు విలువ చేసే వజ్రాలు, రత్నాలను దొంగ‌లు కాజేశారు. ఈ రోజు ఆ వ్యాపారి ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ద‌ర్యాప్తు ప్రారంభించి పోలీసులు ప‌లు ఆధారాలు సేకరించి ఈ నెల 15న చోరీ జరిగినట్లు గుర్తించారు. మురళీకృష్ణకు హైద‌రాబాద్‌లో మూడు ప్రాంతాల్లో వజ్రాలు, రత్నాల దుకాణాలు ఉన్నాయి.

వ్యాపారం నిమిత్తం ఈ నెల 10న ముంబై నుంచి రూ.1.2 కోట్ల విలువైన వజ్రాలు, రత్నాలు తీసుకువచ్చారు. ముధురానగర్లో  ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న ఉంటున్న ముర‌ళీకృష్ణ.. ఇటీవల కొన్నిటిని విక్రయించాడు. ఈ క్ర‌మంలో మిగిలిన వాటిని ఇంట్లోనే ఉంచి బ‌య‌ట‌కు వెళ్లాడు. దీంతో ఈ విష‌యాన్ని గుర్తించిన దొంగ‌లు చోరీకి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ప‌లువురు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్ర‌శ్నిస్తున్నారు.