శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని ద‌ర్శించుకున్న సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ దంప‌తులు

18-06-2021 Fri 10:24
  • ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌
  • స్వాగ‌తం ప‌లికిన‌ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ బ్రహ్మానందరెడ్డి
  • ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగ‌తం  
nv ramana visits srisahilam temple

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే, ఆల‌య ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించారు. అంతకుముందు ఆలయంలోని నంది నికేతన్‌ అతిథిగృహం వద్దకు చేరుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ బ్రహ్మానందరెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు, అధికారులు స్వాగ‌తం ప‌లికారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగ‌తం ప‌లికారు.

జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఆల‌య ప‌రిస‌రాల వ‌ద్ద పోలీసులు భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. కాగా, ఇటీవ‌లే జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు తిరుప‌తిలో శ్రీ‌వారిని, యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్న విష‌యం తెలిసిందే.