'అఖండ'లో అఘోర పాత్రనే హైలైట్ అట!

18-06-2021 Fri 10:21
  • బోయపాటితో మూడో సినిమా
  • రెండు విభిన్నమైన పాత్రల్లో బాలకృష్ణ
  • అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు  
Akhanda movie update

బాలకృష్ణ కథానాయకుడిగా 'అఖండ' సినిమా నిర్మితమవుతోంది. బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, చిత్రీకరణపరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు .. టీజర్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతూ వెళుతున్నాయి. వాళ్లంతా కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో రైతుగా .. అఘోరగా బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. అయితే అఘోర పాత్ర ఎలా ఉంటుందా అనే సందేహం అభిమానుల్లో ఉంది. ఈ పాత్రను బోయపాటి చాలా ఉన్నతంగా తీర్చిదిద్దినట్టుగా చెబుతున్నారు. ఈ పాత్రల్లో బాలకృష్ణ చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ కి విజిల్స్ వర్షం కురుస్తుందని అంటున్నారు. బాలకృష్ణ ఈ పాత్రలో కనిపించడానికి గల కారణం చాలా బలంగా ఉంటుందనీ, అది ఆడియన్స్ ను కట్టిపడేస్తుందని చెబుతున్నారు. ప్రతినాయకుడిగా శ్రీకాంత్ నటిస్తున్న ఈ సినిమాను, దసరాకు విడుదల చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది.