జగన్‌కు వరుసగా తొమ్మిదో రోజూ లేఖ రాసిన రఘురామ కృష్ణరాజు

18-06-2021 Fri 09:11
  • ‘నవ హామీలు-వైఫల్యాలు’ పేరుతో రఘురామ రాజు వరుసగా తొమ్మిది లేఖలు
  • మేనిఫెస్టోలో ఇచ్చిన మద్య నిషేధం ఏమైందని ప్రశ్న
  • గతేడాదితో పోలిస్తే ఈసారి మద్యం అమ్మకాలు 16 శాతం పెరిగాయన్న ఎంపీ
Raghu Rama Krishna Raju writes letter to YS Jagan Consecutive 9th Day

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వరుసగా తొమ్మిదో రోజూ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో జగన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సంపూర్ణ మద్య నిషేధం హామీని ఎంపీ గుర్తు చేశారు. మద్యాన్ని నిషేధిస్తారన్న ఆశతో మహిళలు వైసీపీకి ఓటేశారని, నిషేధం సంగతేమో కానీ మద్య ప్రోత్సాహం ఎక్కువైందని ఆరోపించారు.

రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే మద్యం అమ్మకాలు 16 శాతం పెరిగాయన్నారు. సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉండాలని రఘురామరాజు ఆ లేఖలో డిమాండ్ చేశారు. కాగా, ‘నవ హామీలు-వైఫల్యాలు’ పేరుతో రఘురామ రాజు వరుసగా తొమ్మిది రోజులు తొమ్మిది లేఖలు రాశారు.