Allahabad High Court: వివాహేతర సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

  • భర్త నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలంటూ కోర్టుకెక్కిన భార్య, ఆమె ప్రియుడు
  • స్వేచ్ఛ చట్టానికి లోబడి ఉండాలన్న కోర్టు
  • వివాహేతర సహజీవనానికి అనుమతించబోమన్న ధర్మాసనం
  • పిటిషనర్‌కు రూ. 5 వేల జరిమానా
Allahabad High Court refuses to grant protection to married woman in live in relationship

సహజీవనం చేస్తున్న తమపై కుటుంబ సభ్యులు దాడి చేయకుండా రక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ సహజీవనం ప్రశాంతంగా సాగుతోందని, తమ జీవితంలో భర్త గానీ, ఇతరులు కానీ ఇబ్బందులు కలిగించకుండా చూడాలని ఓ వివాహిత, ఆమె ప్రియుడు కోర్టును అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు.. వివాహిత మరో వ్యక్తితో సహజీవనం చేయడం హిందూ వివాహ చట్టానికి వ్యతిరేకమని పేర్కొంటూ పిటిషనర్‌కు రూ. 5 వేల జరిమానా విధించింది. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ చట్టానికి లోబడి ఉండాలని జస్టిస్ కౌశల్ జయేంద్ర ఠాకెర్, జస్టిస్ దినేశ్ పాఠక్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

చట్టవ్యతిరేకాన్ని ప్రోత్సహించే ఇలాంటి పిటిషన్‌లను అంగీకరించలేమని తేల్చి చెప్పింది. భర్త నుంచి ఇబ్బందులు కనుక ఎదుర్కొంటే తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్న కోర్టు.. జీవితానికి, స్వేచ్ఛకు రక్షణ పేరుతో వివాహేతర సహజీవనానికి అంగీకరించబోమని తేల్చి చెప్పింది.

More Telugu News