సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

18-06-2021 Fri 07:16
  • సాయిపల్లవికి బాలీవుడ్ ఆఫర్!
  • ధనుష్ తో శేఖర్ కమ్ముల ప్రాజక్ట్
  • యూ ట్యూబ్ లో 'మజిలీ' దూకుడు    
Sai Pallavi gives nod for Bollywood offer

*  మొదటి నుంచీ కొన్ని పరిమితులకు లోబడి.. చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్న కథానాయిక సాయిపల్లవి త్వరలో బాలీవుడ్ ప్రవేశం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మకు హిందీ నుంచి ఓ భారీ ఆఫర్ వచ్చిందనీ, ఆమె దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
*  ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తాజాగా దర్శకత్వం వహించిన 'లవ్ స్టోరీ' చిత్రం త్వరలో విడుదల కానుంది. మరోపక్క, దర్శకుడు శేఖర్ తన తదుపరి చిత్రాన్ని తమిళ నటుడు ధనుష్ హీరోగా రూపొందించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిని త్రిభాషా చిత్రంగా నిర్మిస్తారట.
*  నాగ చైతన్య, సమంత కలసి రెండేళ్ల క్రితం నటించిన 'మజిలీ' చిత్రం ఇప్పుడు యూట్యూబ్ లో రికార్డు కొట్టింది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ ను గతేడాది ఫిబ్రవరిలో యూట్యూబ్ లో పెట్టగా, ఇప్పటికి 100 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అలాగే, ఓ మిలియన్ పైగా లైక్స్ కూడా పొందింది.