వైసీపీలో చేరిన ఆంగ్లో ఇండియన్ మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి. థాచర్

18-06-2021 Fri 07:07
  • తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ని కలిసిన నేత
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్
  • కార్యక్రమంలో లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు నేతలు
former mla philip c thatcher joined ysrcp

ఆంగ్లో ఇండియన్ మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి. థాచర్ నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఫిలిప్‌కు జగన్ కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల ఎమ్మెల్సీగా నియమితులైన వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు కత్తెర సురేష్, కత్తెర హెన్రీ క్రిస్టినా తదితరులు పాల్గొన్నారు.