ప్లాట్‌ఫాం టికెట్‌తో రైలులో ప్రయాణం వార్తల్లో నిజం లేదు!

18-06-2021 Fri 06:21
  • ప్లాట్‌ఫాం టికెట్‌తో రైలు ఎక్కేయొచ్చని వార్తలు
  • అలాంటి అవకాశమే లేదని స్పష్టీకరణ
  • ఆ తరహా ఉత్తర్వులేవీ జారీ కాలేదని వివరణ
journey with railway platform ticket news is false

ప్లాట్‌ఫాం టికెట్‌తో రైలు ఎక్కేయొచ్చని, ఆ తర్వాత టీటీఈ దగ్గరికెళ్లి కొంత మొత్తం జరిమానాతో ఎక్కడికంటే అక్కడికి ప్రయాణించొచ్చని, అవసరమైతే రిజర్వేషన్ కూడా అప్పటికప్పుడు పొందవచ్చంటూ వచ్చిన వార్తలపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, ఇప్పటి వరకు అలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని తెలిపింది.

రైల్వే బోర్డు నుంచి కానీ, జోనల్ రైల్వే ప్రధాన కార్యాలయం నుంచి కానీ ఇలాంటి ఉత్తర్వులేవీ జారీ కాలేదని స్పష్టం చేసింది. ప్లాట్‌ఫాం టికెట్‌తో రైలెక్కి టీటీఈ దగ్గర టికెట్ తీసుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పింది.