manipur: రూ.21 కోట్లు విలువ చేసే బంగారం పట్టివేత.. వెలికితీయడానికి 18 గంటలు

  • పోలీసులకు ముందస్తు సమాచారం
  • ఇంఫాల్‌లో ముమ్మర తనిఖీలు
  • కారులోని ప్రత్యేక అరల్లో బంగారం
  • వెలికితీయడానికి 18 గంటలు
Rs 21 cr Gold has been seized

మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే 43 కిలోల బంగారం బయటపడింది. అధికారిక వివరాల ప్రకారం.. బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు ముందే సమాచారం అందింది. దీంతో తనిఖీలను ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. బంగారం అక్రమ రవాణా బయటపడింది. కారులో ఏర్పాటు చేసిన ప్రత్యేక అరల్లో మొత్తం 260 బంగారం బిస్కెట్లను గుర్తించారు. వాటిని కారు నుంచి వెలికి తీసేందుకు 18 గంటల సమయం పట్టడం గమనార్హం. ఇదే వాహనాన్ని గతంలో స్మగ్లింగ్‌కి కూడా వినియోగించినట్లు అధికారులు గుర్తించారు.

మయన్మార్‌ సరిహద్దుల్లో ఉన్న మణిపూర్‌లో బంగారం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత మూడు నెలల్లో 67 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. దీంట్లో 55 కిలోల బంగారం ఒక్క జూన్‌ నెలలోనే పట్టుబడడం గమనార్హం.

More Telugu News