రేపటితో ముగియనున్న ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం... మండలిలో పెరగనున్న వైసీపీ బలం

17-06-2021 Thu 21:38
  • మండలిలో ఇక వైసీపీ హవా
  • 15కి పడిపోనున్న టీడీపీ సభ్యుల సంఖ్య
  • 20కి పెరగనున్న వైసీపీ బలం
  • రేపటితో ఉమ్మారెడ్డి కూడా రిటైర్
YSRCP will be in leading position in AP Legislative Council

ఏపీ శాసనమండలిలో శుక్రవారం నుంచి వైసీపీ బలం పెరగనుంది. రేపటితో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండడమే అందుకు కారణం. ఈ పరిణామంతో మండలిలో టీడీపీ బలం 22 నుంచి 15కి తగ్గుతుంది. అదే సమయంలో వైసీపీ బలం 20కి చేరనుంది. ఇటీవలే నలుగురు వైసీపీ సభ్యులను గవర్నర్ నేరుగా మండలికి నామినేట్ చేయడం తెలిసిందే. ఇక, వైసీపీ సీనియర్ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీకాలం కూడా రేపటితో ముగియనుంది.

తాజా పరిణామాలతో అసెంబ్లీ, శాసనమండలి రెండింట్లోనూ వైసీపీ ఆధిపత్యం కొనసాగనుంది. ఇప్పటివరకు మండలిలో తనకున్న బలంతో టీడీపీ పలు బిల్లులను అడ్డుకున్న విషయం తెలిసిందే. వైసీపీ సభ్యుల సంఖ్య పెరిగి, టీడీపీ సభ్యుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఇకపై ఆ పరిస్థితి కనిపించకపోవచ్చు.