తెలంగాణలో కొత్తగా 1,492 కరోనా కేసులు, 13 మరణాలు

17-06-2021 Thu 19:50
  • తెలంగాణలో మరింత తగ్గిన కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 1,19,464 కరోనా టెస్టులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 166 కేసులు
  • ఆసిఫాబాద్ జిల్లాలో ఒక కేసు నమోదు
Dip in Telangana corona new cases

తెలంగాణలో కరోనా తీవ్రత మరింత దిగొచ్చింది. గడచిన 24 గంటల్లో 1,19,464 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 166 మందికి కరోనా నిర్ధారణ కాగా, ఖమ్మం జిల్లాలో 129, నల్గొండ జిల్లాలో 115 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 1 కేసు నమోదైంది.
 
అదే సమయంలో రాష్ట్రంలో 1,933 మంది కరోనా నుంచి కోలుకోగా, 13 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు 3,534 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,09,417 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,86,362 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,521 మందికి చికిత్స జరుగుతోంది.