విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఖాయం: విజయసాయిరెడ్డి

17-06-2021 Thu 18:55
  • త్వరలోనే విశాఖకు రాజధాని అంటూ వ్యాఖ్యలు
  • ఇంకా ముహూర్తం నిర్ణయించలేదని వెల్లడి
  • విశాఖలో 8 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం
  • ఒక్కో కన్వెన్షన్ సెంటర్ కు రూ.5 కోట్ల వ్యయం
Vijayasai Reddy confidants Visakha as state executive capital

విశాఖ రాజధాని అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ఖాయమని వెల్లడించారు. ఇంకా ముహూర్తం నిర్ణయించలేదని అన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ స్థాయికి తగిన విధంగా విశాఖలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

విశాఖలో మొత్తం 8 కన్వెన్షన్ సెంటర్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఒక్కో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి రూ.5 కోట్ల వ్యయం చేయనున్నట్టు పేర్కొన్నారు. విశాఖలో తాగునీటి సమస్య లేకుండా రూ.500 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక రూపొందించినట్టు వివరించారు.

విశాఖలో భూములు తాకట్టు పెడుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని విజయసాయి మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు తీసుకునేటప్పుడు ఆస్తులు గ్యారంటీలుగా చూపించడం సర్వసాధారణం అని అభిప్రాయపడ్డారు.