Danam Nagender: ఈటల వల్ల బలహీన వర్గాలు తలదించుకునే పరిస్థితి వచ్చింది: దానం నాగేందర్

  • ఉద్యమకారుడే అయితే.. ఉద్యమనేత కేసీఆర్ ను ఎలా విమర్శిస్తారు?
  • ఈటల విషయంలో నేను స్పందించకపోతే తప్పవుతుంది
  • బలహీనవర్గాలు ఈటలకు బుద్ధి చెపుతాయి
Danam Nagender fires on Etela Rajender

బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన నిజమైన తెలంగాణ ఉద్యమకారుడేనా? అని ప్రశ్నించారు. ఆయన ఉద్యమకారుడే అయితే... ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ ను ఎలా విమర్శిస్తారని దుయ్యబట్టారు. తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినా... ఈటల విషయంలో స్పందించకపోతే తప్పవుతుందని చెప్పారు.

రైతుబంధును వ్యతిరేకించిన ఈటల తన భూములకు రైతుబంధు డబ్బులు ఎందుకు తీసుకున్నారని దానం నాగేందర్ ప్రశ్నించారు. ఈటల తీరుతో బలహీన వర్గాలకు చెందిన ప్రజలు తలదించుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలు ఈటలకు బుద్ధి చెపుతాయని అన్నారు. నిజమైన నాయకుడికి బలహీన వర్గాల ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారని చెప్పారు. ఖైరతాబాద్ లో ఈరోజు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను దానం నాగేందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈటలపై విమర్శలు గుప్పించారు.

More Telugu News