Judge Ramakrishna: సబ్ జైలు నుంచి విడుదలైన జడ్జి రామకృష్ణ

  • రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
  • రూ. 50 వేల సొంత పూచీకత్తుపై విడుదల
  • దర్యాప్తు అధికారులకు సహకరించాలని హైకోర్టు ఆదేశం
Judge Ramakrishna released from jail

చిత్తూరు జిల్లా పీలేరు సబ్ జైల్లో ఉన్న జడ్జి రామకృష్ణ విడుదలయ్యారు. దిగువ కోర్టు బెయిల్ ను తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోసం రూ. 50 వేల సొంత పూచీకత్తుతో పాటు ఇద్దరు షూరిటీ సమర్పించాలని ఆదేశించింది. మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని తెలిపింది. దర్యాప్తు అధికారులు కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని షరతు విధించింది. హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

ముఖ్యమంత్రి జగన్ పై ప్రజల్లో ద్వేషం కలిగించేలా వ్యవహరించారనే కారణాలతో ఆయనపై దేశద్రోహం కేసును నమోదు చేశారు. ఏప్రిల్ 15న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు రిమాండ్ కు కూడా తరలించారు.

More Telugu News