మూడు సినిమాలు లైన్లో పెట్టిన శ్రీను వైట్ల!

17-06-2021 Thu 17:08
  • 'దూకుడు' సీక్వెల్ ఆలోచన లేదు
  • మల్టీస్టారర్ గురించిన వార్త పుకారే 
  • మూడు సినిమాలు వినోదప్రధానమైనవే  
Srinu Vaitla is directing for three movies

శ్రీను వైట్ల తన కెరియర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన సినిమాల్లో కామెడీ ఎపిసోడ్స్ హైలైట్ గా ఉంటాయి. కథ ఏదైనా అందులో కామెడీపాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటాడు. అందువలన ఎక్కడా బోర్ కొట్టకుండా ఆయన సినిమాలు నాన్ స్టాప్ ఎంటర్టైనర్లుగా సాగుతూ ఉంటాయి. ఒకానొక దశలో ఆయనతో పని చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీపడ్డారు. అలాంటి శ్రీను వైట్లను ఆ తరువాత వరుస పరాజయాలు పలకరిస్తూ వచ్చాయి. ఆయన చేసిన ప్రయోగాలు విఫలమవుతూ వచ్చాయి.

తాజా ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల మాట్లాడుతూ .. "నేను 'దూకుడు' సినిమాకి సీక్వెల్ చేయనున్నట్టుగా, అలాగే ఓ మల్టీస్టారర్ చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. అలాగే 'డి&డి' సినిమా కూడా 'ఢీ' సినిమాకి సీక్వెల్ అని రాస్తున్నారు .. ఇది కూడా నిజం కాదు. 'డి &డి' కథాకథనాలు పూర్తిగా వేరు. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు చేయనున్నాను. ఈ మూడు కూడా ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్విస్తూ నా మార్కులో సాగేవే" అంటూ చెప్పుకొచ్చాడు.