Sajjala Ramakrishna Reddy: రైతు సమస్యలపై చంద్రబాబు లేఖ రాయడం విడ్డూరంగా ఉంది: సజ్జల

Sajjala responds on Chandrababu letter to CM Jagan
  • ధాన్యం బకాయిలపై సీఎంకు చంద్రబాబు లేఖ
  • విపక్షానిది కపట ప్రేమ అంటూ సజ్జల విమర్శలు
  • చంద్రబాబు లేఖలో అన్నీ అవాస్తవాలేనని ఆరోపణ
  • తమది రైతు ప్రభుత్వం అని ఉద్ఘాటన
ధాన్యం బకాయిలు, ధాన్యానికి మద్దతు ధర వంటి వ్యవసాయిక అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ కు లేఖ రాయడం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల పట్ల విపక్షానిది కపట ప్రేమ అని విమర్శించారు.

రైతుల సమస్యలపై చంద్రబాబు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని అన్నారు. టీడీపీ హయాంలోని బకాయిలను కూడా తమ ప్రభుత్వమే తీర్చిందని, ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించాలని పేర్కొన్నారు. బాబు హయాంలోని చీకటి రోజులను ప్రజలు ఇంకా మరిచిపోలేదని అన్నారు. సీఎం జగన్ కు చంద్రబాబు రాసిన లేఖలోని అంశాలన్నీ అవాస్తవాలేనని సజ్జల తిప్పికొట్టారు.

సీఎం జగన్ పాలన రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు లాభసాటిగా ఉండాలని, రైతులు తమ సొంతకాళ్లపై నిలబడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సజ్జల ఉద్ఘాటించారు.
Sajjala Ramakrishna Reddy
Chandrababu
Letter
Farmers
Jagan
Andhra Pradesh

More Telugu News