ఫస్టుకాపీ రెడీ చేస్తున్న 'నారప్ప'
- వెంకటేశ్ తాజా చిత్రంగా 'నారప్ప'
- తమిళంలో హిట్ కొట్టిన 'అసురన్'కి రీమేక్
- కథానాయికగా ప్రియమణి
- త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన
సురేశ్ ప్రొడక్షన్స్ .. కలైపులి థాను కలిసి నిర్మించిన ఈ సినిమా, ఫస్టుకాపీ రెడీ అవుతోందట. ఒక వారం రోజుల్లో ఫస్టుకాపీ వచ్చేస్తుందని అంటున్నారు. ఇక ఎప్పుడు విడుదల చేయనున్నారనేది త్వరలోనే ప్రకటిస్తారట. అందుకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయని చెబుతున్నారు. వెంకటేశ్ లుక్ .. ఆరంభంలో వదిలిన పోస్టర్లు .. ఆ మధ్య వచ్చిన టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా తప్పకుండా ఆయన కెరియర్లో వైవిధ్యభరితమైన చిత్రంగా నిలుస్తుందని అంటున్నారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అవుతుందని చెబుతున్నారు.