2022 నాటికి దేశంలో 30 లక్షల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు గల్లంతు!
- దేశీయ సాఫ్ట్‌వేర్ రంగంలో 1.6 కోట్ల మందికిపైగా ఉద్యోగులు
- 90 లక్షల మంది తక్కువ నైపుణ్యం కలిగిన సేవలు
- వీరిలోనే 30 శాతం కోత
- ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, టీసీఎస్, విప్రో వంటి సంస్థల్లో కోతకు ప్రణాళిక
దేశీయ ఐటీ రంగంలో పనిచేస్తున్న 1.6 కోట్ల మందిలో 90 లక్షల మంది తక్కువ నైపుణ్యం కలిగిన సేవలు, బీపీవో ఉద్యోగాల్లో పనిచేస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. వీరిలో 30 శాతం మంది (30 లక్షల మంది) 2022 నాటికి ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది. రోబో ప్రాసెస్ ఆటోమేషన్ ప్రభావంతో అమెరికాలో 10 లక్షలు, భారత్‌లో ఏడు లక్షల ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రభావం ఉందని పేర్కొంది. ఇక ఉద్యోగులను తగ్గించుకోవాలనుకుంటున్న సంస్థల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఉన్నాయి.