Andhra Pradesh: నరసరావుపేట, రాజమండ్రి లోక్‌సభ స్థానాలకు కమిటీలను ప్రకటించిన టీడీపీ

TDP announced Committees for Rajamahendravaram and Narasaraopet
  • జవహర్ అధ్యక్షతన 36 మందితో రాజమండ్రికి
  • జీవీ ఆంజనేయులు అధ్యక్షతన 36 మందితో నరసరావుపేటకు కమిటీలు
  • 32 పదవుల్లో బీసీ, ఎస్సీ, మైనారిటీలకు చోటు
ఏపీలోని రెండు లోక్‌సభ స్థానాలకు 36 మందితో కూడిన రెండు కమిటీలను ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు నిన్న ప్రకటించారు. జవహర్ అధ్యక్షతన 36 మందితో రాజమండ్రికి, జీవీ ఆంజనేయులు అధ్యక్షతన 36 మందితో నరసరావుపేటకు కమిటీలను నియమించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వీటిని ఖరారు చేయగా, ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు జాబితాను విడుదల చేశారు. మొత్తం 72 పదవుల్లో 32 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయించగా, మిగిలిన పదవుల్లో ఇతరులను నియమించారు.

Andhra Pradesh
Telugudesam
Rajamahendravaram
Narasarao pet
Atchannaidu

More Telugu News