Alberto Sanchez Gomez: స్పెయిన్ లో నరమాంస భక్షకుడు... తల్లిని చంపి తినేశాడు!

  • తల్లితో వివాదం
  • హత్యకు పాల్పడిన ఆల్బెర్టో గోమెజ్
  • ఖండఖండాలుగా తల్లి శరీరభాగాలు
  • తాను తినగా మిగిలినవి కుక్కకు!
  • 2019లో అరెస్ట్
  • 15 ఏళ్ల 5 నెలల జైలు శిక్ష
Spanish youth who killed and ate his mother sentenced

స్పెయిన్ లో కన్నతల్లినే చంపి తిన్న ఉన్మాదికి జైలు శిక్ష పడింది. 2019లో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా కోర్టు ఆ నరమాంస భక్షకుడికి 15 ఏళ్ల 5 నెలలు జైలు శిక్ష విధించింది. ఆ యువకుడి పేరు ఆల్బెర్టో శాంచెజ్ గోమెజ్ (28). రెండేళ్ల కిందట తన తల్లి నివాసం వద్ద సంచరిస్తున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో గోమెజ్ తన తల్లి శరీర భాగాలను తింటూ కనిపించాడు. మరికొన్ని శరీర భాగాలు ప్లాస్టిక్ కంటైనర్లలో గుర్తించారు.

కాగా, కోర్టులో విచారణ సందర్భంగా గోమెజ్ వాదనలను న్యాయమూర్తి విశ్వసించలేదు. ఏమీ తెలియని ఉన్మాద స్థితిలో ఈ పని చేశానని గోమెజ్ చెప్పగా, న్యాయమూర్తి అందుకు అంగీకరించక జైలు శిక్ష వేశారు. తల్లిని హత్య చేసినందుకు 15 ఏళ్లు, ఆమె శరీర భాగాలను తిన్నందుకు మరో 5 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అంతేకాదు, పరిహారంగా తన సోదరుడికి 60 వేల యూరోలను చెల్లించాలని ఆదేశించారు.

ఓ వివాదం సందర్భంగా ఆగ్రహంతో తల్లి మరియా సోల్డాడ్ గోమెజ్ (60) ను చంపేసిన ఆల్బెర్టో గోమెజ్... ఆమెను ఖండఖండాలుగా చేసి శరీర భాగాలను తినేశాడు. కొన్నింటిని తన కుక్కకు కూడా తినిపించాడు. ఓ వ్యక్తి సమాచారం అందించడంతో ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది.

More Telugu News