Huzurabad: హుజూరాబాద్ కు రూ.35 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

TS Govt sactions 35 cr to Huzurabad
  • వార్డుల అభివృద్ధి, తాగునాటి కోసం నిధుల మంజూరు
  • విషయాన్ని వెల్లడించిన మంత్రి గంగుల
  • పనులకు ప్రత్యేక అధికారులను నియమిస్తామన్న మంత్రి
టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఈటల నియోజకవర్గంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. హుజూరాబాద్ పట్టణాభివృద్ధికి రూ. 35 కోట్లను కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. ఇందులో వార్డుల అభివృద్ధి కోసం రూ. 25 కోట్లు, తాగునీటి కోసం రూ. 10.52 కోట్లను కేటాయించింది. ఈ విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ పనులన్నింటినీ 45 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ పనులను చేయడానికి ప్రత్యేక అధికారులను నియమిస్తామని మంత్రి తెలిపారు.
Huzurabad
Telangana
Funds

More Telugu News