సమంత చేతుల మీదుగా 'పుష్పక విమానం' సాంగ్

16-06-2021 Wed 17:08
  • ఆనంద్ దేవరకొండ నుంచి మరో చిత్రం
  • నూతన కథానాయికగా గీత్ శైనీ పరిచయం
  • ముఖ్యమైన పాత్రలో సునీల్
  • 18వ తేదీన లిరికల్ సాంగ్ రిలీజ్  
 Pushpaka Vimanam lyrical song is released by Samantha
ఆనంద్ దేవరకొండ ... గీత్ శైనీ జంటగా 'పుష్పక విమానం' సినిమా రూపొందింది. ఈ సినిమా ద్వారా దామోదర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. విజయ్ దేవరకొండ సొంత బ్యానర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. త్వరలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. దాంతో ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. అందులో భాగంగా ఆల్రెడీ 'సిలకా' అనే లిరికల్ వీడియోను వదిలారు. ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి 'కల్యాణం .. ' అనే మరో లిరికల్ సాంగ్ ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు. సమంత చేతుల మీదుగా ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ లిరికల్ వీడియోను రిలీజ్ చేయించనున్నారు. కాసర్ల శ్యామ్ రాయగా .. రామ్ మిరియాల సంగీతంలో, సిద్ శ్రీరామ్ - మంగ్లీ కలిసి ఈ పాటను ఆలపించారు. సునీల్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ ఈ సినిమా హిట్ పై గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.