KTR: కేసీఆర్ ది పేదోడి ప్రభుత్వం: కేటీఆర్

  • పేదల అభ్యున్నతే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం
  • పైసా ఖర్చు లేకుండా పేదలకు ఇళ్లు కట్టిస్తున్నాం
  • త్వరలోనే పింఛన్లు, కొత్త రేషన్ కార్డుల మంజూరు 
KCR government is poor peoples government says KTR

పేద ప్రజల కోసం తెలంగాణ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వమని.. పేద ప్రజల అభ్యున్నతే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

ఈరోజు సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి ఎల్లారెడ్డిపేట, రాచర్ల బొప్పాపూర్ గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైసా ఖర్చు లేకుండానే పేదలకు తమ ప్రభుత్వం ఇళ్లను కట్టిస్తోందని చెప్పారు.

నిరుపేదలకు ఎలాంటి అన్యాయం జరగకుండా, చాలా పారదర్శకంగా ఇళ్లను కేటాయిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. నిరుపేదల ముఖాల్లో సంతోషాన్ని చూడటమే తమ లక్ష్యమని అన్నారు. మన దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ మాదిరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లని కట్టించి ఇవ్వడం లేదని చెప్పారు. త్వరలోనే అర్హులందరికీ పింఛన్లు, కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్ కూడా హాజరయ్యారు.

More Telugu News