కడప జిల్లాలో దారుణం.. కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు

16-06-2021 Wed 11:29
  • ప్రేమించిన యువకుడిని పెళ్లాడతానన్న కూతురు
  • కుదరదని చెప్పిన తల్లిదండ్రులు
  • కూతురు ససేమిరా అనడంతో హత్యాయత్నం
Parents set fire their daughter in Kadapa District
కడప జిల్లాలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. కన్నకూతురిపైనే పెట్రోల్ పోసి, నిప్పంటించారు ఆమె తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని రాయచోటిలో ఈ దారుణం జరిగింది. బాధిత యువతి ఒక యువకుడిని ప్రేమించింది. తన ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే, దీనికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆమెకు మరో పెళ్లి సంబంధం చూసేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా ఇంట్లో వివాదం నడుస్తోంది.

తాను ప్రేమించిన యువకుడిని తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోబోనని సదరు యువతి స్పష్టం చేసింది. దీంతో, ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురై, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.