జగన్‌కు వరుసగా ఏడో రోజూ లేఖ రాసిన రఘురామ రాజు

16-06-2021 Wed 09:05
  • కొనసాగుతున్న రఘురామరాజు లేఖాస్త్రాలు
  • రైతు భరోసా సాయాన్ని అందించాలని డిమాండ్
  • కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి మొత్తం రూ. 19,500 అందించాలని డిమాండ్
MP Raghu Ram Krishna Raju write to Jagan consecutive seventh day

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖల పరంపర కొనసాగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన నేడు వరుసగా ఏడో రోజు కూడా లేఖ రాశారు. ఎన్నికల్లో రైతులు పెద్ద ఎత్తున వైసీపీకి అండగా నిలిచారని, కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా రైతు భరోసా సాయాన్ని అందించాలని కోరారు. రైతు సాయంగా కేంద్రం అందిస్తున్న రూ. 6 వేలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 13,500 కలిపి మొత్తం రూ. 19,500ను అందించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.