Delta Expres: కాచిగూడ-రేపల్లె డెల్టా ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్ల పునరుద్ధరణ.. నేటి నుంచే అందుబాటులోకి

  • లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో నిర్ణయం
  • సికింద్రాబాద్-చెన్నై రైలు ఈ నెల 30 వరకు రద్దు
  • తదుపరి ఆదేశాలు వచ్చేవరకు తిరుపతి-చెన్నై రైలు రద్దు 
Delta and Tungabhadra Express Rails resumed Services from today

కాచిగూడ-రేపల్లె మధ్య నడిచే డెల్టా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-కర్నూలు మధ్య నడిచే తుంగభద్ర ఎక్స్‌ప్రెస్, గుంటూరు-కాచిగూడ-గుంటూరు మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు నేటి నుంచి తిరిగి అందుబాటులోకి రానున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రైల్వే అధికారులు వీటిని రద్దు చేశారు. అయితే ఇప్పుడు ఆంక్షలు సడలిస్తుండడంతో తిరిగి వీటిని పట్టాలెక్కించారు.

హైదరాబాద్-చెన్నై మధ్య నడిచే ప్రత్యేక రైలు (02603/02604)ను నేటి నుంచి ఈ నెల 30 వరకు రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. దీంతోపాటు తిరుపతి-చెన్నై సెంట్రల్ మధ్య నడిచే (06204/06203) రైలును నేటి నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.

More Telugu News