TTD: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా నేడు విడుదల

Rs 300 special tickets sells online from today says TTD
  • ఈ నెల 22, 23, 24వ తేదీలకు సంబంధించిన టికెట్లు 
  • రోజుకు 5 వేల చొప్పున టికెట్లు అందుబాటులో
  • సన్నిధి యాదవుల హక్కులపై గెజిట్ విడుదల 
తిరుమల శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే. ఈ నెల 22, 23, 24వ తేదీలకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు. ఈ మూడు రోజుల్లో రోజుకు 5 వేల చొప్పున టికెట్లను విక్రయిస్తారు.

కాగా, తిరుమలలో పనిచేస్తున్న సన్నిధి యాదవులకు వంశపారంపర్య హక్కులు పునరుద్ధరిస్తూ చేసిన సవరణ చట్టం నిన్నటి నుంచే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతోపాటు దేవాలయాలను ఏబీసీ కేటగిరీలుగా విభజించేందుకు సంబంధించి ఆదాయ పరిమితులను మార్చేందుకు ప్రభుత్వానికి అధికారం కల్పించే సవరణ చట్టం కూడా నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినట్టు పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
TTD
Tirumala
Tirupati
Online Tickets

More Telugu News