Naira Shah: బాయ్ ఫ్రెండ్ తో కలిసి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన టాలీవుడ్ నటి

Police arrests Tollywood actress Naira Shah in Mumbai
  • ముంబయిలో నైరా షా అరెస్ట్
  • బాయ్ ఫ్రెండ్ తో కలిసి బర్త్ డే పార్టీ
  • రూంలో గంజాయి సిగరెట్లు తాగుతూ దొరికిన వైనం
  • కేసు నమోదు చేసిన పోలీసులు
దేశంలోని పలు చిత్ర పరిశ్రమల్లో డ్రగ్స్ వాడకంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంలోనూ డ్రగ్స్ కోణం ప్రముఖంగా వినిపిస్తోంది. పలువురు టాలీవుడ్ హీరోయిన్లను కూడా దర్యాప్తు అధికారులు విచారించినట్టు తెలిసింది.

తాజాగా, ఓ టాలీవుడ్ నటి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం మరింత కలకలం రేపుతోంది. 'బుర్రకథ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది భామ నైరా షా ముంబయిలో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మాదకద్రవ్యాలు ఉపయోగిస్తూ దొరికిపోయింది.

నైరా షా తన పుట్టినరోజు సందర్భంగా జుహూ ప్రాంతంలోని ఓ హోటల్లో రూమ్ బుక్ చేసుకుంది. తన స్నేహితుడు ఆషిక్ ఎస్ హుస్సేన్ తో కలిసి పార్టీ చేసుకుంది. అయితే, నార్కొటిక్స్ విభాగం అధికారులు వెళ్లే సమయానికి నైరా షా, ఆషిక్ హుస్సేన్ గంజాయి నింపిన సిగరెట్లు తాగుతూ దర్శనిమిచ్చారు.

పక్కా సమాచారంతో దాడి చేసిన అధికారులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల్లోనూ నైరా షా, ఆషిక్ హుస్సేన్ మాదకద్రవ్యాలు తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

2019లో వచ్చిన బుర్రకథ చిత్రంలో ఆది హీరో కాగా, నైరా షా కూడా నటించింది. ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకుడు.
Naira Shah
Drugs
Birthday
Mumbai
Police
Tollywood

More Telugu News