Vaccine: ఇక 18 ఏళ్లు దాటిన వాళ్లు నేరుగా కరోనా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లొచ్చు: కేంద్రం ప్రకటన

  • దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారికీ వ్యాక్సిన్
  • ప్రీ బుకింగ్ అవసరంలేదన్న కేంద్రం 
  • వ్యాక్సిన్ కేంద్రాల వద్దే వివరాల నమోదు
  • ఎక్కువమంది వ్యాక్సిన్ పొందుతారంటున్న నిపుణులు
Centre tells eighteen plus age group people can get vaccine without pre registration

కరోనా వ్యాక్సినేషన్ అంశంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇకపై 18 ఏళ్లు నిండిన వాళ్లు సైతం కరోనా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి నేరుగా డోసులు పొందవచ్చని స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇది తప్పనిసరి నిబంధనేమీ కాదని వెల్లడించింది. కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్దే తమ వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.

 తాజా వెసులుబాటు ద్వారా దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మరింత ఊపందుకుంటుందని కేంద్రం భావిస్తోంది. దేశంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారు అత్యధిక సంఖ్యలో ఉన్నందున, తాజా వ్యాక్సినేషన్ డ్రైవ్ తో అత్యధిక శాతం మంది టీకాలు పొందే వీలుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, దేశంలోని కొన్నిచోట్ల వ్యాక్సిన్ల పట్ల ప్రజల్లో తీవ్ర విముఖత కనిపిస్తుండడం ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆందోళనకు గురిచేస్తోంది.

More Telugu News