Taj Mahal: రేపటి నుంచి తాజ్ మహల్ సందర్శనకు అనుమతి

  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటివరకు ఆంక్షలు
  • తగ్గిన కరోనా ఉద్ధృతి
  • ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్
  • విడతకు 650 మందికి అనుమతి
Taj Mahal reopens from tomorrow

చారిత్రక కట్టడం తాజ్ మహల్ సందర్శనకు రేపటి నుంచి అవకాశం కల్పించనున్నారు. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఆగ్రాలోని తాజ్ మహల్ సందర్శనను ఇన్నాళ్లూ నిలిపివేశారు. ఇప్పుడు వైరస్ మహమ్మారి వ్యాప్తి నియంత్రణలోకి రావడంతో క్రమంగా ఆంక్షలు సడలిస్తున్నారు. తాజ్ మహల్ సందర్శన షురూ చేయాలని నిర్ణయించారు.

 అయితే తాజ్ మహల్ చూడాలనుకునేవారు ఆన్ లైన్ లోనే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఫోన్ ద్వారా గరిష్ఠంగా 5 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుంటుంది. తాజ్ మహల్ సందర్శనకు విడతకు 650 మందిని అనుమతించనున్నారు.

తాజ్ మహల్ లోపల సందర్శకులు గుమికూడకుండా ప్రత్యేక సిబ్బందితో పర్యవేక్షణ ఏర్పాటు చేయనున్నారు. సందర్శకులు ఓ స్పాంజిపై నడిస్తే వారి పాదరక్షలు శానిటైజ్ అయ్యే విధంగా ఆధునిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. అటు, ఆగ్రాకు సమీపంలోని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 228 పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి.

More Telugu News