మారుతి సెట్ చేసిన కొత్త సినిమా టైటిల్!

15-06-2021 Tue 18:22
  • ఆహా కోసం మారుతి సినిమా
  • 30 రోజుల్లో షూటింగు పూర్తి
  • కరోనా  నేపథ్యంలో సరదాగా సాగే కథ  
Maruthi new movie update

యువతరం దర్శకులలో మారుతికి మంచి క్రేజ్ ఉంది. మొదట్లో యూత్ మెచ్చే సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన మారుతి, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడంలో సక్సెస్ అయ్యాడు. 'ప్రతిరోజూ పండగే' సినిమా తరువాత మారుతి 'పక్కా కమర్షియల్' ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ లోగా ఆయన ఆహా కోసం ఒక సినిమాను ప్లాన్ చేసుకుని, 30 రోజుల్లో షూటింగును పూర్తిచేసే ఉద్దేశంతో రంగంలోకి దిగాడు.

సంతోష్ శోభన్ - మెహ్రీన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ షూటింగును జరుపుకుంది. మరికొన్ని రోజుల్లో షూటింగు పార్టును పూర్తి చేసుకోనుంది. ఈ సినిమాకి 'మంచి రోజులు వచ్చాయి' అనే టైటిల్ ను సెట్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. కరోనా రాకముందు ఎలా ఉన్నాము? ఆ తరువాత పరిస్థితులు ఎలా మారిపోయాయి? అనే అంశం చుట్టూనే ఈ కథ నడుస్తుందని అంటున్నారు. కథ మొత్తం కూడా సరదా సరదాగా సాగిపోతుందని చెబుతున్నారు. కరోనా సమయంలో అంతా కూడా 'మహానుభావుడు' సినిమాను గుర్తు చేసుకున్నారు. ఇక ఈ సినిమాతో మారుతి ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి.