ఏపీలో కొత్తగా 5,741 కరోనా కేసులు

15-06-2021 Tue 17:55
  • తాజాగా 53 మంది మృతి
  • చిత్తూరు జిల్లాలో 12 మంది కన్నుమూత
  • 12,052కి చేరిన మొత్తం కరోనా మరణాల సంఖ్య
  • యాక్టివ్ కేసుల సంఖ్య 75,134 
AP Corona Deaths crosses twelve thousand mark

ఏపీలో గడచిన 24 గంటల్లో 96,153 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,741 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 831 కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 830 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 130 కేసులు గుర్తించారు.

ఇక తాజాగా రాష్ట్రంలో 53 కరోనా మరణాలు సంభవించగా, ఒక్క చిత్తూరు జిల్లాలోనే 12 మంది చనిపోయారు. తాజా మరణాలతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 12,052కి చేరింది.

అదే సమయంలో 10,567 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు 18,20,134 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 17,32,948 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 75,134కి తగ్గింది.
.