'ఆచార్య' సృష్టికర్త కొరటాల శివకు జన్మదిన శుభాకాంక్షలు: చిరంజీవి

15-06-2021 Tue 15:14
  • నేడు దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజు
  • కొరటాలపై శుభాకాంక్షల వెల్లువ
  • ట్విట్టర్ లో స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
  • తనదైన శైలిలో వ్యాఖ్యలు
Megastar Chiranjeevi conveys birthday wishes to Koratala Siva

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి చిత్రాలతో సమాజానికి అంతర్లీనంగా ఓ సందేశం ఇచ్చి అటు కమర్షియల్ గానూ, ఇటు సామాజిక స్పృహ పరంగానూ సక్సెస్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ సినీ దర్శకుడు కొరటాల శివ. కొరటాల శివ ఇవాళ తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' సినిమా తెరకెక్కిస్తున్నారు. తన దర్శకుడు కొరటాల జన్మదినం సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

'ఆచార్య' సృష్టికర్త కొరటాల శివకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. "ఆ కలానికి సమాజంలో మార్పు తేవాలన్న తపన ఉంది. ఆ దర్శకుడికి ఆశయాన్ని దృశ్యంగా మలిచే దార్శనికత ఉంది" అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.