క‌ల్వ‌కుంట్ల క‌వితను త‌మ ఇంటికి ఆహ్వానించి, ఆడ‌ప‌డుచు కానుక అందించిన మంత్రి కొప్పుల దంప‌తులు

15-06-2021 Tue 13:33
  • జ‌గిత్యాల జిల్లా ప‌ర్య‌ట‌న‌లో క‌విత‌
  • ఆమెకు ఆత్మీయ కానుక అందించిన కొప్పుల‌
  • చిరున‌వ్వుతో స్వీక‌రించిన క‌విత‌
kavita visits koppula home

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత జ‌గిత్యాల జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమెను త‌మ ఇంటికి ఆహ్వానించిన తెలంగాణ‌ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ దంప‌తులు ఆమెకు ఆత్మీయ కానుకను అందించారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ కొప్పుల ఈశ్వ‌ర్ ట్వీట్ చేశారు.

    
'నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌విత జ‌గిత్యాల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా కరీంనగర్ లోని మా నివాసానికి ఆత్మీయంగా ఆహ్వానించి, సంప్రదాయ బద్ధంగా ఆడపడుచు కానుక అందించడం జరిగింది' అని కొప్పుల ఈశ్వర్ చెప్పారు. చిరున‌వ్వులు చిందిస్తూ ఆ కానుక‌ను క‌విత స్వీక‌రించారు.