వ‌రుస‌గా ఆరో రోజు సీఎం జ‌గ‌న్‌కు ర‌ఘురామ లేఖ‌!

15-06-2021 Tue 12:25
  • ప్ర‌భుత్వ ఉద్యోగులకు డీఏ పెంచాలి
  • పీఆర్సీ  ప్ర‌క‌ట‌న  చేయాలి
  • ఎన్నిక‌ల ముందు ఈ హామీలు ఇచ్చారు
  • ఇప్ప‌టికీ అమ‌లు కాలేదు
   raghu rama writes letter to jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌కు వైసీపీ అసంతృప్త ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వ‌రుస‌గా ఆరో రోజు మ‌రో లేఖ రాశారు. గత ఎన్నికల ముందు ప్ర‌భుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, పీఆర్సీ  ప్ర‌క‌ట‌న‌ విషయంలో జ‌గ‌న్ హామీలు ఇచ్చార‌ని ర‌ఘురామ గుర్తు చేశారు. ఆయా హామీల‌ను ఇప్ప‌టికీ నెరవేర్చలేద‌ని, క‌నీసం ఇప్ప‌టికైనా హామీల‌ను నెర‌వేర్చాల‌ని కోరారు.  

ఈ హామీలు నెర‌వేర్చుతార‌ని ఉద్యోగులు ఎదురుచూస్తున్నార‌ని, వాటిని నెర‌వేర్చితే వారి ముఖాల్లో ఆనందాన్ని చూడొచ్చ‌ని పేర్కొన్నారు. కాగా, ఇప్ప‌టికే ఆయ‌న వ‌రుస‌గా వృద్ధాప్య పింఛ‌న్లు, సీపీఎస్‌ విధానం రద్దు, పెళ్లి కానుక‌, షాదీ ముబార‌క్, ఉద్యోగాల క్యాలెండ‌ర్, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం వంటి అంశాల‌పై జ‌గ‌న్‌కు లేఖ‌లు రాసిన విష‌యం తెలిసిందే. ఈ హామీల‌ను ఇచ్చిన జ‌గ‌న్ ఇప్ప‌టికీ నెర‌వేర్చ‌లేద‌ని ఆయ‌న చెబుతూనే వాటిని నెర‌వేర్చాల‌ని కోరుతున్నారు.