Vijayashanti: తెలంగాణ భూముల అమ్మకంపై మంత్రి హరీశ్ రావు వాదన అసంబద్ధంగా ఉంది: విజయశాంతి

  • భూములు అమ్ముతున్నారంటూ విజయశాంతి ధ్వజం
  • ధనికరాష్ట్రం అని కేసీఆర్ చెప్పారన్న విజయశాంతి
  • మరి భూముల అమ్మకం, వేలం ఏంటని ఆగ్రహం
  • ప్రజలు ఉద్యమాలు చేస్తారని హెచ్చరిక
Vijayasanthi furious over TRS Govt

భూముల అమ్మకం అంశంపై బీజేపీ నేత విజయశాంతి తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, మరి రాష్ట్రంలో ఈ భూముల అమ్మకాలు ఏంటని విజయశాంతి ప్రశ్నించారు. తెలంగాణ భూముల అమ్మకంపై రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు వాదన చాలా అసంబద్ధంగా ఉందని విమర్శించారు. గత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భూముల అమ్మకాలు, దోపిడీకి వ్యతిరేకంగానే అందరం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తించాలని హితవు పలికారు.

భూముల అమ్మకం, వేలం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశాం అని సీఎం ఒప్పుకుని క్షమాపణలు చెప్పి తీరాలని విజయశాంతి డిమాండ్ చేశారు. ఈ అంశంలో ప్రజలు తప్పకుండా ఉద్యమాలకు సమాయత్తమవుతారని హెచ్చరించారు.

ఠికాణా లేక భూములు అమ్ముకునేంత వరకు తీసుకువచ్చిన మీకు ఈ కోట్ల విలువైన కార్ల పంపిణీ ఎందుకు? ఉన్న జైళ్లు కూల్చడం ఎందుకు? కోట్ల రూపాయల వృథా పబ్లిసిటీ ఖర్చులెందుకు? సచివాలయానికే రాని సీఎంకు కొత్త భవనాలెందుకు? అంటూ విజయశాంతి ప్రశ్నల వర్షం కురిపించారు.

More Telugu News