పాతికేళ్ల క్రితం ఏం జరిగిందంటే.. అంటున్న రవితేజ!

14-06-2021 Mon 18:05
  • 'క్రాక్'తో దొరికిన హిట్
  • థియేటర్లకి రానున్న 'ఖిలాడి'
  • శరత్ మండవకి దర్శకుడిగా ఛాన్స్
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్
Raviteja next movie update

రవితేజ మొదటి నుంచి కూడా తన సినిమాల విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉంటాడు. తన నుంచి ఏడాదికి మూడు  సినిమాలు థియేటర్లకు వెళ్లాలనే ఆలోచనతోనే ఆయన ఉంటాడు. ఆ దిశగానే తన ప్రాజెక్టులను సెట్ చేసుకుంటాడు. ఈ ఏడాది 'క్రాక్' సినిమాతో థియేటర్లలో సందడి చేసిన రవితేజ, త్వరలో 'ఖిలాడి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే  ఆ తరువాత సినిమాను రవితేజ సెట్ చేసుకున్నాడు.

రవితేజ తదుపరి సినిమా శరత్ మండవ దర్శకత్వంలో ఉండనుంది. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో రవితేజ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట. 25 ఏళ్లక్రితం వెనక్కి వెళ్లి అక్కడ ఈ కథ నడుస్తుందని అంటున్నారు. అందుకు సంబంధించిన సెట్స్ వేయిస్తున్నారని చెబుతున్నారు. ఆల్రెడీ ఇంతకుముందే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుందని అంటున్నారు. ఇందులోను ఇద్దరు కథానాయికలు సందడి చేస్తారట.