కరోనా విధుల్లో డాక్టర్ మరణిస్తే రూ.25 లక్షల పరిహారం: ఏపీ ప్రభుత్వం ప్రకటన

14-06-2021 Mon 17:00
  • ఫ్రంట్ లైన్ వర్కర్లపై సర్కారు కరుణ
  • విధుల్లో మరణించిన వైద్య సిబ్బంది పరిహారం నిర్ధారణ
  • స్టాఫ్ నర్సులకు రూ.20 లక్షలు
  • ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలకు రూ.15 లక్షలు
  • ఇతర సిబ్బందికి రూ.10 లక్షల పరిహారం
AP Govt decides ex gratia for medical staff

రాష్ట్రంలో కరోనాతో మరణించిన వైద్య సిబ్బందికి ఏపీ ప్రభుత్వం పరిహారం నిర్ణయించింది. కరోనా విధులు నిర్వర్తిస్తూ వైద్యులు మరణిస్తే రూ.25 లక్షలు, స్టాఫ్ నర్సులు మరణిస్తే రూ.20 లక్షలు, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు మరణిస్తే రూ.15 లక్షలు, ఇతర వైద్య సిబ్బందికి రూ.10 లక్షలు పరిహారం అందించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు పరిహారాన్ని కేటగిరీలుగా విభజన చేసి ఉత్తర్వులు జారీ చేసింది. పీఎం గరీబ్ కల్యాణ్ యోజనకు అదనంగా ఈ మొత్తాన్ని అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్ విధుల్లో ఉన్నవారికే ఈ పరిహారం అని స్పష్టం చేసింది.