కొత్త ప్రయాణం మొదలైంది: బీజేపీలో చేరికపై ఈటల స్పందన

14-06-2021 Mon 16:06
  • బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటల
  • బీజేపీకి కృతజ్ఞతలు తెలిపిన వైనం
  • తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతానని ప్రకటన  
  • ఎప్పటికీ ప్రజాసేవకే అంకితమని ఉద్ఘాటన
Eatala says new journey starts after joining BJP

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన అనంతరం ఈటల మాట్లాడుతూ, ఇవాళ తాను కొత్త ప్రయాణం మొదలుపెట్టానని చెప్పారు. తమ పరివారంలో తనకు కూడా స్థానం కల్పిస్తూ, పార్టీలో చేరికకు స్వాగతించిన బీజేపీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని ఉద్ఘాటించారు. ఇప్పుడు, ఎల్లప్పుడూ ప్రజలు, పార్టీ కోసమే శ్రమిస్తానని పేర్కొన్నారు.