సంచయిత నియామకం రద్దు.. అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా పునర్నియమించాలని హైకోర్టు ఆదేశం

14-06-2021 Mon 13:25
  • ప్ర‌స్తుతం ట్ర‌స్టుకు ఛైర్మ‌న్‌గా సంచ‌యిత‌
  • హైకోర్టును ఆశ్ర‌యించిన అశోక్ గ‌జ‌ప‌తిరాజు
  • ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులను ర‌ద్దు చేయాల‌ని విన‌తి
  • సానుకూలంగా తీర్పు
high court giver verdict on mansas trust

మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను స‌వాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న తర్వాత త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది.

గ‌తంలో సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజును ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ర‌ద్దు చేసింది. ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేస్తూ అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా పునర్నియమించాలని పేర్కొంది. ప్ర‌స్తుతం ఆ ట్ర‌స్టుకు సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజు ఛైర్మ‌న్‌గా ఉన్న విష‌యం తెలిసిందే.