gangula: 'హుజూరాబాద్‌'లో రెండు ప‌థ‌కాల చెక్కుల పంపిణీని ప్రారంభించిన మంత్రి గంగుల‌

gangula slams opposition parties
  • కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ
  • ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై విమ‌ర్శ‌లు
  • ఇక‌పై ఆ పథకాలు ఉండాలా? వ‌ద్దా? అని ప్ర‌శ్న
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఈ రోజు తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌భుత్వం  కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న తెలంగాణ‌ మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పాటుప‌డుతోంద‌ని చెప్పుకొచ్చారు.

టీఆర్ఎస్ ప‌థ‌కాల‌పై కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌కంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్, కేసీఆర్ కిట్ పథకాలు అవసరం లేదని కొందరు నాయకులు అంటున్నార‌ని ఆరోపించారు. అయితే, ఇక‌పై ఆ పథకాలు ఉండాలా? వ‌ద్దా? అన్న విష‌యాన్ని ప్రజలు ఆలోచించుకోవాలని గంగుల చెప్పారు. గ‌త ప్రభుత్వాల వ‌ల్లే వెనుకబడిన వర్గాలకు స‌రైన విద్య అంద‌లేద‌ని ఆరోపించారు. టీఆర్ఎస్ సర్కారు వ‌చ్చాక‌ 260 గురుకులాలు స్థాపించామ‌ని అన్నారు.
gangula
TRS
Telangana

More Telugu News