'మాస్ట్రో' చివరి షెడ్యూలు మొదలెట్టిన నితిన్!

14-06-2021 Mon 11:24
  • రీమేక్ మూవీగా 'మాస్ట్రో'
  • హిందీలో 'అంధాదూన్'కి రీమేక్. 
  • కీలకపాత్రలో తమన్నా
  • నితిన్ ను నిరాశపరిచిన 'చెక్', 'రంగ్ దే'  
Maestro final shooting started from today

నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో' సినిమా రూపొందుతోంది. చాలావరకూ షూటింగును ఇప్పటికే కానిచ్చేశారు. చివరి షెడ్యూల్ చేయాలని అనుకుంటూ ఉండగా కరోనా ప్రభావం పెరిగిపోయింది. దాంతో మిగతా ప్రాజెక్టుల మాదిరిగానే ఈ సినిమా షూటింగు ఆగిపోయింది.

ఇక ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉండటంతో, ఈ సినిమా టీమ్ చకచకా రెడీ అయింది. చివరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ రోజున ఈ సినిమా షూటింగు మొదలైపోయింది. తరుణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.

హిందీలో హిట్ కొట్టిన 'అంధాదూన్' సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో నభా నటేశ్ కథానాయికగా నటిస్తుండగా, తమన్నా ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఇక బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల నితిన్ చేసిన 'చెక్' .. 'రంగ్ దే' సినిమాలు నిరాశపరిచాయి. అందువలన ఈ సినిమాతో తప్పకుండ హిట్ కొట్టాలనే పట్టుదలతో నితిన్ ఉన్నాడు.