తెలంగాణలో మరో 1,280 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

13-06-2021 Sun 21:33
  • గత 24 గంటల్లో 91,621 కరోనా టెస్టులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 165 కేసులు
  • కామారెడ్డి జిల్లాలో ఒక్క కేసు నమోదు
  • రాష్ట్రంలో 15 మంది మృతి

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించింది. కొన్నివారాల కిందట మహోగ్రంగా సాగిన కరోనా వ్యాప్తి ఇప్పుడు మరింత తగ్గింది. గడచిన 24 గంటల్లో 91,621 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,280 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 165 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 156 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో 2,261 మంది కరోనా నుంచి కోలుకోగా, 15 మంది మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,03,369 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,78,748 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 21,137 మంది చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య 3,484కి చేరింది.