KIA: తెలంగాణలో అదనపు కలెక్టర్లకు కియా కార్లు... పరిశీలించిన సీఎం కేసీఆర్

KIA cars for Telangana districts additional collectors
  • ఒక్కో కారు విలువ రూ.24.95 లక్షలు!
  • ప్రగతి భవన్ లో కొలువుదీరిన కార్లు
  • కార్ల వివరాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్
  • జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పువ్వాడ
  • బీజేపీ ఆగ్రహం!
తెలంగాణ జిల్లాల అదనపు కలెక్టర్ల అధికారిక వాహనాలుగా కియా కార్లు రంగప్రవేశం చేయనున్నాయి. జిల్లాల అడిషనల్ కలెక్టర్ల కోసం ప్రభుత్వం 32 కియా కార్లను కొనుగోలు చేసింది. ఈ కార్లను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్ లో పరిశీలించారు. అధికారులను అడిగి వాటి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, ఈ కార్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
కాగా, ప్రభుత్వం కొనుగోలు చేసిన ఒక్కో కియా కారు విలువ రూ.24.95 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. అయితే, దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కరోనా సంక్షోభ సమయంలో ఇంత ఖర్చుతో కార్లు కొనుగోలు చేయడం అవసరమా? అని ప్రశ్నించింది.
KIA
Cars
Additional Collectors
CM KCR
Puvvada Ajay Kumar
Telangana

More Telugu News