VH: కాంగ్రెస్ విధేయులకే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలనడం తప్పా?: వీహెచ్

  • తెలంగాణలో పీసీసీ రగడ
  • కొత్త అధ్యక్షుడి ఎంపికపై హైకమాండ్ కసరత్తులు
  • బయటి నుంచి వచ్చినవారికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న వీహెచ్
  • తమను అవమానిస్తున్నారని ఆవేదన
VH demands PCC Chief chance for loyalists

ఓవైపు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంపై హైకమాండ్ ముమ్మరంగా కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో, సీనియర్ నేత వి. హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రమైన పరిస్థితి నెలకొందని, బయటి నుంచి వచ్చినవారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది తమలాంటి వారిని అవమానించడమేనని పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ విధేయులకు ఏం గౌరవం ఇస్తున్నారని ప్రశ్నించారు. హైకమాండ్ కు అభిప్రాయాలు తెలియజేస్తూ లేఖలు రాయడం తప్పా? అని నిలదీశారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారి గత చరిత్రను ఆరా తీయాలని వీహెచ్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ ను సైతం విమర్శించారు. తెలంగాణ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మాణికం ఠాగూర్ చేసిందేమిటి? అని ప్రశ్నించారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడి కోసం ఠాగూర్ ఒక్కరే అభిప్రాయ సేకరణ జరిపారని, అదే ఇతర రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్ష ఎంపిక కోసం హైకమాండ్ పరిశీలకుడిని పంపిందని వివరించారు.

More Telugu News