Women Priests: తమిళనాడు ఆలయాల్లో ఇకపై మహిళా పూజారులు!

  • ఆలయాల్లో ఇప్పటివరకు పురుషులే పూజారులు
  • ఆనవాయితీ మార్చనున్న తమిళనాడు సర్కారు
  • మహిళా పూజారుల కోసం కోర్సులు
  • హిందువులు ఎవరైనా పూజారులు కావొచ్చన్న మంత్రి పీకే శేఖర్ బాబు
Women priests in Tamilnadu temples soon

ఆలయాల్లో పూజారులుగా పురుషులు ఉండడం సాధారణ విషయం. అయితే తమిళనాడులో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. త్వరలోనే తమిళనాడు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆలయాల్లో మహిళా పూజారులు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆలయాల్లో పూజారులుగా వ్యవహరించేందుకు ఆసక్తి చూపించే మహిళలకు సంబంధిత శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం కొత్త కోర్సును కూడా తీసుకువస్తోంది.

దీనిపై రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు స్పందిస్తూ, హిందువులు ఎవరైనా పూజారులు కావొచ్చన్నప్పుడు మహిళలకూ ఆ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనుమతి అనంతరం మహిళలకు పూజారి శిక్షణ అందుబాటులోకి తీసుకువస్తున్నామని వివరించారు.

More Telugu News