Varla Ramaiah: ఆయన ఎంతోమంది పేదల ఇళ్లకు పండుగను తీసుకొచ్చారు... మీరేమంటారు సీఎం గారూ?: వర్ల రామయ్య

Varla Ramaiah tweets in style
  • తనదైన శైలిలో వర్ల ట్వీట్
  • గత ప్రభుత్వ పథకాలపై వివరణ
  • ఎంతోమందికి ఉపయోగపడ్డాయని వెల్లడి
  • వాటిపై ప్రస్తుత సీఎంను ప్రశ్నించిన వైనం

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మరోసారి తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ఆయన ఇచ్చిన పెళ్లి కానుక ఎంతోమంది నూతన దంపతులకు సాయపడిందని వెల్లడించారు. ఆయన ఇచ్చిన క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక ఎందరో పేదల ఇళ్లకు పండుగను తీసుకొచ్చిందని తెలిపారు.

అన్న క్యాంటీన్లు పేదల ఆకలిని తీర్చాయని, ఆయన అందించిన విదేశీ విద్యాసాయం ఎంతోమంది దళిత విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దిందని వివరించారు. దీనిపై మీరేమంటారు సీఎం గారూ...? అంటూ ట్విట్టర్ లో ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News